googled9ea612717259035.html

LalithaNH - Lalitha Nursing Home

Go to content
పరకాల ప్రాంత ప్రజల సౌకర్యార్ధం సకల సౌకర్యాలతో 2000 ఫిఁబవరి 10 వ తేదిన మా ఆసుపత్రి అద్దె భవనంలో ప్రారంభించి దినదిన ప్రవర్థమానం చెందుతూ ప్రజలకు సరసమైన ధరలు నాణ్యమైన వైద్యాన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందించాం.   ఈ నేపధ్యంలో మెట్టమెదటిసారిగా జనరల్ ఫిజీషన్, గైనిక్, డెలివరీ, అల్ట్రాసౌండ్ సేవలను అందించాం. ఈ  ప్రాంత ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలతో పాటు కార్పొరేటు స్థాయిలో సౌకర్యాలు కల్పించి సేవలందించాలని భావించాం.  దీనికి అనుగుణంగా అత్యధునాతనమైన వైద్య పరికరాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించాలని నిర్ణయించాము.  ఈ మేరకు 2011 జనవరి మాసంలో సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.  భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకుని 2012 డిసెంబరు 5 వ తేదిన ఆసుపత్రిని ప్రారంభించాం.  నూతన ఆసుపత్రి లో ఆర్దో, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, పిల్లలకు, గర్భిణీలకు వైద్య సేవలందించటం ప్రారంభించాం.  గుండె సంబంధ, దంత సంబంధ శస్ర్త చికిత్సలు కూడా మొదలెట్టాం.  ఈ నేపధ్యంలోనే  ఆసుపత్రి సేవలను గుర్తించి ప్రభుత్వం మొట్టమొదటి సారిగా పరకాల ప్రాంతంలో ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవసరమైన పరికరాలు, ఆపరేషన్ ధియేటర్లు సౌకర్యాలను గుర్తించి నిరుపేదలకు వైద్యాన్ని అందించే ఆరోగ్య శ్రీ పధకాన్ని, ఎంప్లాయిమెంట్ స్కీం (ఈ.హెచ్.యస్.) , స్టార్ , ఐసీఐసీ లాంటి ఎన్నో మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వారి లబ్ధిదారులకు సౌకర్యాలు అందించే అవకాశాన్ని మా ఆసుపత్రికి కల్పిస్తూ అనుమతించారు.  ఇదే రెట్టింపు ఉత్సాహం, రోగుల సహకారం, వారికి నయమవుతున్న తీరు ఈ ప్రాంత ప్రజల మన్ననలు, ప్రేమాభిమానాలతో మరిన్ని సేవలను మరింత అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం.  దీనిలో భాగంగానే పెరుగుతున్న శాస్ర్త, సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చాం.   ఈసీజీ, ఎన్.ఎస్.టీ, ల్యాప్రోస్కోప్, సీ-ఎ.ఆర్.యం. మల్టీప్యారా మానిటర్స్, సీ.ఓటి మానిటర్స్, సెంట్రలైజ్  ఆక్పీజన్ విధానంతో పాటు కార్పొరేటు ఆసుపత్రులకు ధీటుగా బెడ్స్ , పల్స్ఆక్సీ, బీ.పి. లాంటి సౌకర్యాలను కల్పించాం.  నిరంతరం రెండు అంబులెన్సులను అందుబాటులో  ఉంచి వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందిస్తున్నాం. కాలంతో పోటీ పడుతూ నిత్యం నిర్విరామంగా అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ మాతో పాటు అన్ని రకాల వైద్య నిఫుణులను అందుబాటులో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందిస్తున్నామని తెలియజేయట కు సంతోషిస్తున్నాం.



లలిత నర్సింగ్ హోమ్
మల్టీ స్పెషాలిటీ హాస్పటల్
హుజూరాబాద్ రోడ్, పరకాల,
వరంగల్ జిల్లా.

ఫోన్ నెం: 08713-240899
సెల్ నెం: 98495 48874
© 2015, Lalitha Nursing Home.All Rights Reserved.
Back to content